ఫోటోషాప్
ఫోటోషాప్ లో మాయల పకీరు చేసే చిత్ర విచిత్రాలు అన్ని చేయవచు. ఉన్నదీ
లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగా కూడా సృష్టించవచ్చు. మనుషుల ఆకారాలను కూడా మర్చవచ్చు.
మిగిలిన ప్యాకేజిలలో చేస్తునప్పుడు అంతగా ఏమి అనిపించదు. ఎదో వర్క్ చేస్తున్నాము.
డేటాఎంట్రీ చేస్తున్నాము, అని అనిపిస్తుంది. కానీ ఇందులో తమాషాలన్ని చేయవచ్చు.
రంగురంగుల ఆకారాలను సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామా అన్న
ఫీలింగ్ ఏర్పడుతుంది.
ఫోటోషాప్ ప్రోగ్రాం రంగంలోకి వచ్చిన తరువాత ప్రింటింగ్ రంగంలో ముఖ్యంగా కలర్ ప్రింటింగ్
రంగంలో అనూహ్యమైన మార్పులు, నాణ్యత వచాయి. ఈ ఫోటోషాప్ లో చేస్తున్న కొద్దీ చేయాలి
అనిపిస్తుంది. టైం తెలియదు. సృజనాత్మకత ఉన్నవారికి ఈ సాఫ్ట్ వేర్ లో అనేక ఉద్యోగ
అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈనాటి డిజిటల్ కెమేరాలో ఫొటోస్ అన్ని కూడా ఫోటోషాప్ లో చేసి ప్రింట్ తీసినవే.
పాత బ్లాక్ & వైట్ ఫొటోస్ ని కలర్ చేయడం, చిరిగిపోయి పాడయిపోయిన ఫొటోస్ ని
కూడా సరిచేయవచ్చు. ఎన్నేళ్ళ క్రితమో తీయించుకున్న స్వీట్ మెమొరీస్ గా ఉన్న ఫొటోస్
పడయిపోతే ఎవరికైన భాధగానే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ పుణ్యమా అని ఆ ఫొటోస్ అన్నీ కూడా
మరల జీవం పోసుకున్తున్నాయి.
పేజీమేకర్ వర్క్ చేస్తున్నపుడు. ఫొటోస్ అవసరం అయితే ఈ సాఫ్ట్వేర్ లోనే స్కాన్
చేసుకోనో లేక డిజిటల్ కేమేరలో ఉన్నవి తీసుకోవడమో లేక సిడిల నుంచి తీసుకోవడం
చేస్తాం. తరువాత పేజీమేకర్ లో ప్లేస్ చేసుకుంటాం. ఈ ఫోటోషాప్ ఒకరి తలలు కూడా సెట్
చేసుకోవచ్చు. అలాగే మనం ఇంటి దగ్గరే ఎక్కడయినా ఫోటో తీయించుకొని మనం తాజమహల్
దగ్గరో తియిన్చుకున్నట్లుగా కూడా సెట్
చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసినట్లు కూడా తెలియదు.
Post a Comment