Photoshop Telugu Tutorials | Photoshop Software Interface
ఫోటోషాప్ టుటోరియల్స్ లేఔట్
ఫోటోషాప్ ను
Start > Programs > Adobe
Photoshop CS మీద క్లిక్
చేయాలి.
––
లేదా Run ఓపెన్ అందులో Photoshop అని టైపు చేసి OK పై క్లిక్ చేయలి.
అలా క్లిక్
చేసిన తరువాత క్రింద చూపిన విధంగా మనకి ఒక లయవుట్ కనిపిస్తుంది.
దీనినే ఫోటోషాప్
విండో అంటారు. ఇందులో మనకి ఎడమ వైపు ఉన్న
దానినే Toolbox అంటారు. పేజిమేకర్ లోని టూల్బార్ని పోలి
ఉంటుంది. అందులో కంటే ఇందులో ఎక్కువ
టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ తోనే బొమ్మలు గీయడం, చెరిపి మళ్ళి వేయడం వంటివి కూడా
చేయవచ్చు. కుడి వైపు ఉన్న వాటిలో మొదటి బాక్స్ ని నావిగేటర్ బాక్స్ అంటారు. ఇందులో
ఇమేజ్ యొక్క ప్రివ్యూని మనం చూడవచ్చు. తరువాత ఉన్నదాన్ని కలర్ పాలెట్ అంటారు. మనం
కలర్స్ సెలక్షన్ ఇందులోనుండి చేసుకుంటాం. తరువాతది లేయర్ పాలెట్. ఫోటోషాప్ లో
అత్యంత ముఖ్యమైనది ఇది. దిని ద్వారనే మనం తరువాత చాల వర్క్ చేయవలసి ఉంటుంది.
టైటిల్ బార్:
ఫోటోషాప్ విండోలో అన్నిటికన్నా పైన
Adobe Photoshop అనే టైటిల్ తో డిస్ ప్లే అయ్యేదే టైటిల్
బార్.
ఈ టైటిల్
బార్ కి ఎడమ ప్రక్కన విండోని మాగ్జిమయజ్,
మినిమైజ్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి మూడు ఐకాన్స్ ఉంటాయి.
మెనూ బార్:
విండోలో టైటిల్ బార్ తరువాత ఉండేది మెనూబార్.
ఈ మేనూబార్ మీద రకరకాల మెనూలు ఉంటాయి. ప్రతి మెనూలో చాల రకాల ఆప్షన్స్
ఉంటాయి. File, Edit, Image ...... ఇలా రకరకాల మెనూలు ఉంటాయి.
ఆప్షన్ బార్:
మెనూబార్ క్రింద ఉండేది ఈ ఆప్షన్ బార్. టూల్ బాక్స్ లో
సెలెక్ట్ చేసుకున్న టూల్ ని కస్టమైజ్ చేసే కంట్రోల్స్ ని డిస్ ప్లే చేస్తుంది. మనం
ఉపయోగిస్తున్న ఆప్షన్ ను అనుసరించి ఆప్షన్ టూల్ బార్ డిస్ ప్లే అవుతుంది. ఒకొక్క
ఆప్షన్ కి ఆప్షన్ టూల్ బార్ డిఫరెంట్ గ
ఉంటుంది. ఆప్షన్ టూల్ బార్ మిద
మనం పర్ఫారం చేసుతున్న టాస్క్ కి సంబందించిన అన్ని
రకాల ఆప్షన్స్ ని సిద్ ప్లే చేస్తుంది. ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోనవచ్చును.
పాలేట్స్:
ఫోటోషాప్ లోనిచాల వర్క్స్ ని పాలెట్స్ ని ఉపయోగించి చేస్తాము. మమూలు
కమాండ్స్ మరియు వాటికీ సంబందించిన రిపోర్ట్స్ ని ఎక్సెస్
చేయడానికి వీలుగా ఉండే చిన్న
చిన్న ఫ్రీ ఫ్లోటింగ్ విండోలను పాలెట్స్ అంటారు.
వీటిని విండోలో ఎక్కడకి
కావాలంటే అక్కడికి తీసుకోని వెళ్ళవచ్చు.
ఇమేజ్ విండో:
ఓపెన్ అయిన
ఫోటోషాప్ డిస్ ప్లే చేసి చూపించే దానిని ఇమేజ్ విండో అని అంటారు. విండోలో మనయొక్క
ఫోటోషాప్ ఇమజేస్ డిస ప్లే చేసి చూపించే ప్రదేశం.
టూల్ బాక్స్:
ఎలాంటి యంత్రానికి
అయిన, సిస్టంకి అయిన సమర్ధవంతంగా పని చేయడానికి టూల్ బాక్స్ చాలా అవసరం అదే విధంగా
ఫోటోషాప్ లో అత్యంత ముఖ్యమయినది టూల్ బాక్స్. ఫోటోషాప్ లో వర్క్ మొత్తం లేయర్స్ టూల్
బాక్స్ యొక్క టూల్స్ ను ఉపయోగించి ఇమజేస్ ని మనకు కావాల్సిన విధంగా మార్పులు,
చేర్పులు చేయడానికి వీలు అవుతుంది.
టూల్ బాక్స్ లో చాల రకాల
టూల్స్ ఉంటాయి. టూల్ బాక్స్ లోని ప్రతిటూల్లో వివిధ రకాల టూల్స్ ఉంటాయి. సెలక్ట్
చేసుకున్న టూల్ యొక్క ఐకాన్ మీద ఉన్న యారోని క్లిక్ చేస్తే ఆ టూల్ లో మిగిలిన
టూల్స్ ని డిస్ ప్లే చేస్తుంది.
మరిన్ని వివరాలకి క్రింద
వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts అమయిన ఉంటె
కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి
నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment